రైతులకు తీరని యూరియా కష్టాలు..
తెలంగాణ, ఆసిఫాబాద్. 15 సెప్టెంబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. తిండి నిద్రలను మాని రైతులు వేకువజామున నుంచే వ్యవసాయ కేంద్రాల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. సోమవారం కాగజ్ నగర్ వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా క
యూరియా


తెలంగాణ, ఆసిఫాబాద్. 15 సెప్టెంబర్ (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో

రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. తిండి నిద్రలను మాని రైతులు వేకువజామున నుంచే వ్యవసాయ కేంద్రాల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. సోమవారం కాగజ్ నగర్ వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు వేకువజామున 5 గంటలకే వచ్చి క్యూ కట్టారు. ఇక అలాగే రెబ్బెన ప్రాథమిక సహకార సొసైటీ యూరియా వచ్చి తెలియడంతో వివిధ గ్రామాల నుంచి రైతులు భారీగా తరలివచ్చి.. ఉదయం 7 గంటలకే కార్యాలయం ఎదుట తమ పట్టా పాస్ జిరాక్స్ పత్రాలు పెట్టి క్యూ కట్టారు. ఒక రెండు బస్తాలైన దొరుకుతాయని ఆశతో వేచి ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే యూరియా సరఫరా పెంచి.. యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande