మాజీ డిప్యూటీ CM రాజయ్య హౌస్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ, స్టేషన్గన్పూర్. 15 సెప్టెంబర్ (హి.స.) మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తున్నాయి.
రాజయ్య హౌస్ అరెస్ట్


తెలంగాణ, స్టేషన్గన్పూర్. 15 సెప్టెంబర్ (హి.స.)

మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రఘునాథపల్లి మండలంలో పర్యటనకు సిద్ధమైన తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల వేళ అక్కడి వెళ్లడం మంచిది కాదని వారు సూచించారు. వారించినా... వినకపోడంతో పోలీసులు రాజయ్యను గృహ నిర్బంధం చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆందోళనకు దిగగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande