న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. కొన్ని విభాగాలకు కొంత రక్షణ అవసరం అని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తి ఎజి మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..