ఆడబిడ్డలను చదువుకు దూరం చేసారా?: జాగృతి నేత కవిత
హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎగవేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కమిషన్ల సర్కార్ అని.. 20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇృతామ
కవిత


హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎగవేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కమిషన్ల సర్కార్ అని.. 20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇృతామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశంపై ఇవాళ ఎక్స్ లో పోస్టు చేసిన కవిత.. కమిషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్ పెట్టడంతో ఇప్పటికే కాలేజీలు నడపలేక యాజమాన్యాలు ఆర్థికంగా చితికిపోయాయన్నారు. కాలేజీలు మూతపడితే ఆడబిడ్డలు చదువులకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆడబిడ్డలను చదువులకు దూరం చేస్తోందని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande