అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వీ కన్వెన్షన్ హాల్ పహారి గోడ సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి గా షెడ్లపై గోడ కూలడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులపై పడడంతో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ (50) గా పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ