ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి.. నల్లగొండ రహదారి పై భూనిర్వాసితుల రాస్తారోకో
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 15 సెప్టెంబర్ (హి.స.) ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ భూ నిర్వాసితులు మునుగోడు నల్లగొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా గేటు వద్ద త్రిబుల్
రాస్తారోకో


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 15 సెప్టెంబర్ (హి.స.)

ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ భూ నిర్వాసితులు మునుగోడు నల్లగొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా గేటు వద్ద త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులు నల్గొండకు వెళ్లే రహదారిపై సోమవారం ఉదయం బైఠాయించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ రాకతో తమ భూములు కోల్పోయి నిరాశ్రయులం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ఏం చేయాలో కూడా తెలియదని వాపోయారు. బహిరంగ మార్కెట్లలో భూముల విలువ కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో తాము ఎక్కడ భూములు కొనే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ట్రిబుల్ ఆర్ లేకున్నా సంతోషంగా జీవనం గడుపుతామని లేదంటే అలైన్మెంట్ మార్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande