ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ‘RERA’ చైర్మన్‌గా శివారెడ్డి నియామకం
అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA)‌కు చైర్మన్‌, నలుగురు సభ్యుల నియామకం కోసం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ‘RERA’ చైర్మన్‌గా శివారెడ్డి నియామకం


అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA)‌కు చైర్మన్‌, నలుగురు సభ్యుల నియామకం కోసం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా చైర్మన్‌గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్‌గా పని చేసిన ఏ.శివారెడ్డి (A.Shiva Reddy)ని నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ (S Suresh Kumar) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మరో ముగ్గురు సభ్యులను కూడా త్వరలోనే ఎన్నుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande