బెంగళూరు:,15, సెప్టెంబర్ (హి.స.) చరిత్రాత్మక మైసూరు దసరా వేడుకలను (Mysore Dasara Festival) ప్రారంభించడానికి బుకర్ ప్రైజ్ విజేత (Booker Prize winner) బాను ముస్తాక్ (Bhanu Mushtaq)ను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సోమవారం నాడు తోసిపుచ్చింది. పార్లమెంటు మాజీ సభ్యుడు ప్రతాప్ సింహాతో సహా నాలుగు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి విభు భక్రు, న్యాయమూర్తి సీఎం జోషితో కూడిన డివిజన్ బెంచ్ నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి వేరే మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తిని ఆహ్వానించడం చట్ట ఉల్లంఘనగా కానీ, రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘించడంగా కానీ తాము భావించడం లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ