అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఈ వర్షం తీవ్రత అధికంగా ఉంది. నిన్న గుంటూరులో క్లౌడ్ బరెస్ట్ తరహాలో భారీ వర్షం కురవడంతో నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure) కొనసాగుతుండగా.. దానికి ద్రోణి ప్రభావం (trough effect) తోడైంది. దీంతో వచ్చే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండి అలుగు పారుతుండగంతో వదరల ముంపు.. వివిధ ప్రాంతాల్లో అధికం అవుతుంది. దీంతో నిత్యం అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి