హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)
ఇన్ఫోసిస్లో లో ఉద్యోగం చేస్తున్న
ఎనిమిది మంది ఉద్యోగులు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్ఫోసిస్ కు చెందిన సౌమ్య రెడ్డి, వీరేంద్ర, నంద కిషోర్, ప్రణీష్, సాగర్, అరవింద్, జాన్సీ, శృతి లు మొత్తం ఎనిమిది మంది హైదరాబాద్ శివారు రాచకొండలోని సరళ మైసమ్మ తల్లి ఆలయానికి ఇన్నోవా క్రిస్టా కారులో వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ ఉన్న ఓఆర్ఆర్ లోకి ప్రవేశించారు. కాగా ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామ పరిధిలో కి చేరుకోగానే కారును డ్రైవింగ్ చేసిన వీరేందర్ ఓఆర్ఆర్ డివైడర్ ను బలంగా ఢీ కొట్టారు. అందరికీ తీవ్ర రక్తస్రావం కావడంతో వ
వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్యరెడ్డి, నందకిషోర్ లను మెరుగైన చికిత్స కోసం ఉప్పల్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సౌమ్య రెడ్డి మృతి చెందింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు