నిందితులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం.. దిశా పటానీ కుటుంబానికి సీఎం హామీ
న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.)నటి దిశా పటానీ కుటుంబానికి ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. ఇటీవల దిశా ఇంటి ముందు కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఆరా తీశారు. దిశా (Disha Patani) తండ్రికి ఫోన్‌ చేసిన సీఎ
Cm yogi


న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.)నటి దిశా పటానీ కుటుంబానికి ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. ఇటీవల దిశా ఇంటి ముందు కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఆరా తీశారు. దిశా (Disha Patani) తండ్రికి ఫోన్‌ చేసిన సీఎం.. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరతామని హామీ ఇచ్చారు. సీఎం మాట్లాడిన వివరాలను దిశా తండ్రి జగదీశ్‌ మీడియాతో పంచుకున్నారు.

‘‘యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) మాకు ఫోన్‌ చేశారు. మా కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. రాష్ట్రం మొత్తం మాకు అండగా ఉంటుందని చెప్పారు. మాకు పూర్తి భద్రతనిస్తామన్నారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయబోమని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారు అండర్‌ గ్రౌండ్‌లో దాగి ఉన్నా పట్టుకుంటామని హామీ ఇచ్చారు’’ అని సీఎం మాట్లాడారని దిశా తండ్రి మీడియాకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande