ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్దిని గుండెపోటుతో మృతి
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)):అప్పటిదాకా కాలేజీలో శ్రద్ధగా పాఠాలు విని ఇంటికి బయల్దేరిన డిగ్రీ విద్యార్థిని.. నడుస్తూ నడుస్తూనే రోడ్డుపై కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అందరి నీ విస్మయాన
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్దిని గుండెపోటుతో మృతి


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)):అప్పటిదాకా కాలేజీలో శ్రద్ధగా పాఠాలు విని ఇంటికి బయల్దేరిన డిగ్రీ విద్యార్థిని.. నడుస్తూ నడుస్తూనే రోడ్డుపై కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అందరి నీ విస్మయానికి గురిచేసిన ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో సోమవారం జరిగింది. అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి(18) నందిగామలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో సీఎం రోడ్డులో స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళ్తు న్న ఆమె ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న వారు ఆమెను వెంటనే స్థానిక ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు నిర్ధారించిన వైద్యులు ఆమెకు గుండెపోటు వచ్చినట్టు చెప్పారు. నాగమణి మృతి పట్ల అధ్యాపకులు, తోటి విద్యార్థులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. కాలేజీకి బయల్దేరే ముందు గ్యాస్‌ సమస్య అనిచెప్పి టాబ్లెట్‌ వేసుకుని వచ్చిందని, సాయంత్రం వరకూ బాగానే ఉందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande