బెంగుళూరు నుంచి నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి రానున్నారు
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.) : బెంగళూరు నుంచి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 9.10 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి, 9.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆపై ఉదయం 10.15 గంటలకు విమానంలో
బెంగుళూరు నుంచి నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి రానున్నారు


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)

: బెంగళూరు నుంచి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 9.10 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి, 9.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆపై ఉదయం 10.15 గంటలకు విమానంలో బయలుదేరనున్న జగన్, ఉదయం 11.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, 12.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం, అందుబాటులో ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande