అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.): ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో మంగళవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. ‘మేం ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వానికి సహకరిస్తూ వసు ్తన్నాం. అయితే ఆస్పత్రుల ఆర్థిక భారం నేపథ్యంలో సేవలను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ.2 వేల కోట్లు బకాయిలతో ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. వారం రోజుల్లోగా ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి’ అని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ