ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. రెడ్‌ అలర్ట్‌ జారీ
న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.)ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కా
uttarakhand police


న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.)ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు.. దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.

రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కుంకుమ్‌ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande