తిరుమల, 16 సెప్టెంబర్ (హి.స.)భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ఫుల్ అయినట్లు టీటీడీ (TTD) తెలిపింది. ఇప్పటికే టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్నవారికి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇప్పటి నుంచి క్యూలైన్లోకి వెళ్లేవారికి 12-15 గంటల్లో దర్శనం కలుగుతుందని తెలిపింది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు మారుతాయని స్పష్టం చేసింది.
టోకెన్లు ఉన్న భక్తులకు సర్వదర్శనానికి 3-5 గంటల సమయం, రూ.300 టికెట్లు ఉన్నవారికి స్పెషల్ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (సోమవారం) స్వామివారిని 65,066 మంది భక్తులు దర్శించుకోగా.. 24,620 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.4.13 కోట్లు వచ్చినట్లు టీటీడీ చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి