
బెంగళూరు/న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.): రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య(CM Siddaraiah) మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర వరుణ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా కొనసాగి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే సీఎం మనవడు ధవన్ రాకేశ్(Dhavan Rakesh)ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
సిద్దరామయ్య రాజకీయ వారసుడిగా పెద్ద కుమారుడు రాకేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే రాకేశ్ అకాలమరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాతనే యతీంద్రను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సిద్దరామయ్య మరోసారి పోటీ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల వేళ వరుణ నియోజకవర్గంలో ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు. నామినేషన్ సమయంలోనూ ధవన్ రాజకీయాల్లోకి వస్తారని ప్రస్తావించిన విషయం కూడా ఉంది. మారుతున్న రాజకీయాలలో రిటైర్డు అయ్యేది లేదని ఇటీవలే ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ