కోల్‌కతా/న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.): దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్‌కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)ను ప్రారంభించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు కోసం మార్పు: సీసీసీలో సైనిక దళాల్లో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలను ప్రధాని సమీక్షించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌లో సైనిక దళాలు చూపిన తెగువను ప్రధాని ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ