మోదీతో ర్యాలీలో నీతీశ్‌ వ్యాఖ్యలు వైరల్‌
న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.) ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌ (Bihar)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా అక్కడి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూర్చున్న ప్రజలు లేచి ప్రధానికి
Nitish kumar


న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.) ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌ (Bihar)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా అక్కడి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూర్చున్న ప్రజలు లేచి ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

పూర్ణియాలో జరిగిన బహిరంగ సభలో నీతీశ్‌ మాట్లాడారు. చివరిగా.. ‘నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మోదీ (PM Modi) బిహార్‌ కోసం చాలా చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇంకా ఎందుకు కూర్చున్నారు?. మీరు లేచి నిలబడి ఆయనకు ధన్యవాదాలు తెలపండి’ అని ప్రజలకు సూచించారు. ఈక్రమంలోనే అక్కడ ఉన్న మహిళలు లేచి ప్రధానికి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. అనంతరం మోదీ కూడా వారికి నమస్కారం చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన మద్దతుతో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కొద్దిరోజుల పాటు ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నందుకు చింతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇకపై ఎప్పటికీ ఎన్డీయేలోనే కొనసాగుతానని మోదీకి మాట ఇచ్చారు. నీతీశ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande