ఉద్యమంలా స్వచ్ఛాంధ్ర : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)స్వచ్ఛాంధ్రప్రదేశ్​ను ఉద్యమంలా చేస్తున్నాం.. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభంలో స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీ పై జరి
చంద్రబాబు


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)స్వచ్ఛాంధ్రప్రదేశ్​ను ఉద్యమంలా చేస్తున్నాం.. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభంలో స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీ పై జరిగిన చర్చలో ఆయన మాట్టాడారు.

మొదటిసారి సింగపూర్ ​వెళ్లి అక్కడ పరిస్థితిని అధ్యయనం చేశామని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్​లో నైట్​క్లీనింగ్​ను ప్రారంభించామన్నారు. సాలిడ్​ లిక్విడ్ ​వేస్ట్ ​మేనేజ్​మెంట్​పై దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యంగా డ్రెయిన్ల శుభ్రతపై చర్యలు తీసుకోలవాలని తెలిపారు. వర్షపు నీరు, ఇళ్లలోకి నీరు వస్తే ఇంకపోయేలా కొత్త టెక్నాలజీని తీసుకొస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande