తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న చైర్మన్, ఈవో
తిరుమల, 16 సెప్టెంబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుశ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల (Tirumala)లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రతువ
తిరుమల


తిరుమల, 16 సెప్టెంబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుశ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల (Tirumala)లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ క్రతువులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)తో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal), ఉన్నతాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్వామి వారికి వస్త్రం కప్పి పూజ సామగ్రికి, ఇతర ఉప ఆలయాలు, ఆలయ గోడలను సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల తరువాత భక్తుల దర్శనాలకు అనుమతించనున్నారు.

కాగా, ఏడాదిలో నాలుగుసార్లు తిరుమల ప్రధాన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande