విజయవాడ, 16 సెప్టెంబర్ (హి.స.)విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav)పై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయవాడ ఉత్సవ్’ను అడ్డుకునేందుకు దేవినేని అవినాశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని వరుసగా విమర్శలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరి జాతకాలు రెడ్ బుక్ నుంచి బయటకు రాబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఉత్సవాల నిర్వహణ తర్వాత భూములను దేవదాయ శాఖలకు అప్పజెపుతామని అన్నారు. మచిలీపట్నం దేవాదాయ భూముల దోపిడీపై ముందు పేర్ని నాని (Perni Nani) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి