ఏపి మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఫోకస్
అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.) అమరావతి,: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 3, 500 కోట్ల మేర స్కాం జరిగిందంటూ సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువు
ఏపి మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఫోకస్


అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి,: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 3, 500 కోట్ల మేర స్కాం జరిగిందంటూ సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువురు నిందితులు.. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్ట్ అయి.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సైతం బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాంటి వేళ.. ఈ మద్యం కుంభకోణంలో దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది. ఆ క్రమంలో చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు గురువారం ముమ్మర దాడులు నిర్వహించారు. దాదాపు 10 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande