ముందు నీ ఇంటిని.. పార్టీని చక్కబెట్టుకో”- కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్
తెలంగాణ, ఖమ్మం. 18 సెప్టెంబర్ (హి.స.) నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్.. ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో.. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా.. ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమ
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఖమ్మం. 18 సెప్టెంబర్ (హి.స.)

నీకు విజన్ ఉందా? నీ నాన్నకు

ఉందా తెలుసుకో కేటీఆర్.. ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో.. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా.. ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండి” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు. గురువారం ఖమ్మంలో వారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 80కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్లో చేరగా వారికి మంత్రి కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాటు ప్రజల కలలను ఛిద్రము చేసిందని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande