తెలంగాణ, నారాయణపేట. 18 సెప్టెంబర్ (హి.స.)
నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు జరిగిన ఈ మహా ర్యాలీని ఎమ్మెల్యే, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు బానిసలు అయితే జీవితం నాశనం అవుతుందని అన్నారు. ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడిన యువత ఉంటే డయల్ 100కు సమాచారం అందిస్తే, వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తేవడానికి పోలీస్ శాఖ తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు. నారాయణపేట జిల్లాలో డ్రగ్స్ నివారణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు