తెలంగాణ, సంగారెడ్డి. 18 సెప్టెంబర్ (హి.స.)
ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా
మహిళ నిండు ప్రాణం బలైపోయింది. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద గురువారం మధ్యాహ్నం రెడ్ సిగ్నల్ పడిన కూడా ఓ లారీ డ్రైవర్ లారీని ముందుకు అతివేగంగా తీసుకొచ్చాడు. అప్పుడే రోడ్డు దాటుతున్న ముగ్గురిని లారీ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో సదాశివపేటకు చెందిన విజయలక్ష్మి(56) లారీ వెనుక భాగంలో టైరు కింద పడి శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ ఇద్దరనీ సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు