తెలంగాణ, షాద్నగర్. 18 సెప్టెంబర్ (హి.స.)
పేద ప్రజలకు అండగా ఉండే
ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం సహాయనిధి చెక్కులను ఫరూఖ్ నగర్ మండలం కు చెందిన సుమారు 60 మంది లబ్దిదారులకు 15 లక్షల రూపాయల చెక్కులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పేద ప్రజలను ఆదుకోవాలని, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక్క వైపు ఆరోగ్య శ్రీ వైద్యం చేయిస్తూ మరోపక్క సీఎం రిలీఫ్ పండు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు