ఆసియా కప్ లో నేడు భారత్, ఓమన్ మధ్య పోరు..
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ 2025లో భారత్ చివరి లీగ్ మ్యాచ్ శుక్రవారం ఓమన్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సూపర్ 4 రౌండ్లో భారత్ స్థానం సంపాదించుకుంది. మొదట యూఏఈ ని, ఆ తర్వాత పాకిస్థాన్ ను ఓడించిన టీమిండియా తదుపరి రౌండ్లోకి ప్రవ
ఆసియా కప్


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

ఆసియా కప్ 2025లో భారత్ చివరి లీగ్ మ్యాచ్ శుక్రవారం ఓమన్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సూపర్ 4 రౌండ్లో భారత్ స్థానం సంపాదించుకుంది. మొదట యూఏఈ ని, ఆ తర్వాత పాకిస్థాన్ ను ఓడించిన టీమిండియా తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది. ఓమన్తో మ్యాచ్ కేవలం ప్రాక్టీస్గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇందుకోసం జట్టులో మూడు మార్పులు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.టీమిండియా తదుపరి మ్యాచ్ అబుదాబి లో జరుగుతుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande