అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు.. ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు
ఆసిఫాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని సింగిల్ గూడ గ్రామంలో వారు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేన
ఆసిఫాబాద్ పోలీసులు


ఆసిఫాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

అసాంఘిక కార్యకలాపాలకు

పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని సింగిల్ గూడ గ్రామంలో వారు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 15 బైక్లతో పాటు 2 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి సాగు విక్రయాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి గంజాయి నిర్మూలనకు సహకారించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande