పాత బస్టాండ్కు బస్సులు రావాలని ఇబ్రహీంపట్నం లో బిజెపి ధర్నా
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) మండల కేంద్రంలోని పాత బస్టాండ్ కు బస్సులు రావాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఇబ్రహీంపట్నం బస్సు డిపో నుంచి బస్సులు రాకపోకలు సాగ
బిజెపి ధర్నా


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

మండల కేంద్రంలోని పాత బస్టాండ్ కు బస్సులు రావాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఇబ్రహీంపట్నం బస్సు డిపో నుంచి బస్సులు రాకపోకలు సాగించే క్రమంలో బస్సులు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని పాత బస్టాండ్ కు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ ఆధ్వర్యంలో బస్సు డిపో ముందు ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాత బస్టాండ్ కు బస్సులు రావాలని పలుమార్లు డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే గురువారం రాత్రి అంబేద్కర్ చౌరస్తా లో ఆగిన బస్సు డ్రైవర్ ను బస్సు పాత బస్టాండ్ వెళ్లాలని అడిగితె దురుసుగా మాట్లారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బస్సులను పాత బస్టాండ్ కు నడపాలని, డిపో మేనేజర్ వెంటనే స్పందించి పాత బస్టాండ్ కు వచ్చే విధంగా హామీ ఇచ్చి, వెంటనే బస్సు డ్రైవర్స్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande