ఏజెన్సీలో మళ్లీ అలజడి.. కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ.. హై అలర్ట్
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న మావోయిస్టు పార్టీ శుక్రవారం అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ పేరుతో లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ నాయకులతో పాటు కొంతమంది వ్యక్తులను, భూస్వాములను పద్ధతి
హై అలర్ట్


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న మావోయిస్టు పార్టీ శుక్రవారం అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ పేరుతో లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ నాయకులతో పాటు కొంతమంది వ్యక్తులను, భూస్వాములను పద్ధతి మార్చుకోవాలని లేకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు అని హెచ్చరించారు. దీంతో ఏజెన్సీలో మళ్ళి అలజడి మొదలైనట్టు అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సరిహద్దు ప్రాంతం అయిన, వెంకటాపురం, వాజేడు మండలాలు ములుగు జిల్లాలో ఉన్నప్పటికీ. మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇక్కడ కూడా అలజడి రేపింది. దీంతో ఇక్కడ పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. టార్గెట్ లో ఉన్న నాయకులు, వ్యాపారులను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ముందస్తు సూచనలు చేస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్ లతో భారీగా నష్టపోయిన మావోయిస్టు పార్టీ వారి ఉనికిని చాటుకునేందుకు ఏదైనా చేయొచ్చు అని పోలీసులు సైతం భావించి టార్గెట్ ఉన్న వ్యక్తులను మైదాన ప్రాంతాలకి పరిమితం కావాలని సూచిస్తున్నారు.

చాలావరకు ఆపరేషన్ కగార్ తో ఇప్పటికే వరుస ఎన్ కౌంటర్ లలో అగ్ర నాయకత్వాన్ని కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలి పోతున్నారు. వారి ఉనికే కోల్పోయే పరిస్థితికి రావడంతో ఎలాగైనా వారి ఉనికిని చాటుకోవాలని పనిలో మావోయిస్టులు సైతం ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో భాగంగానే మళ్ళీ తెలంగాణలో తమ పట్టు నిలుపుకునేందుకు లేఖ విడుదల చేసినట్లు భావిస్తున్నారు. ఏదైనా అవంచానియా ఘటనతో ఏజెన్సీ లో మళ్ళీ పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు అని పోలీసులు అంచనా వేసి వారికి అడ్డుకట్ట వేసేందుకు భద్రత బలగాల తో అడవిని జల్లెడ పడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande