నేరాల అదుపు కోసమే కార్డెన్ సెర్చ్.. హుజురాబాద్ ఏసిపి మాధవి
కరీంనగర్, 19 సెప్టెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు జరిపిన విస్తృత సోదాలలో సరైన పత్రాల
ఏ సి పి మాధవి


కరీంనగర్, 19 సెప్టెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు జరిపిన విస్తృత సోదాలలో సరైన పత్రాలు లేని 52 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి, సైబర్ మోసాలు రోడ్డు భద్రత కు సంబంధించిన అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ ఎస్సై శేఖర్ రెడ్డి టీఎస్ఎస్పి బలగాలు పాల్గొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande