హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. ఆ తల్లుల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. దేశవిదేశాల నుంచి వచ్చే వారి కోసం సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. దీంతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే జాతరకు రూ.కోట్ల నిధులు కుమ్మరించడం ఆ తర్వాత అవి కొన్నాళ్లకు పాడవటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై ఇలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం అధికారులు మాస్టర్న్ సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత పనులు ప్రారంభంకానున్నట్లు చెబుతున్నారు. వచ్చే జనవరిలో జరిగే జాతర నాటికి శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..