'వారిని ప్రజా కోర్టులో చంపేస్తాం'.. సంచలనం రేపుతున్న మావోయిస్టు లేఖ
భద్రాద్రి కొత్తగూడెం, 19 సెప్టెంబర్ (హి.స.) భూస్వామ్య పెత్తందారుల్లారా ఖబర్దార్. ప్రజా కోర్టులో మిమ్మల్ని హతమారుస్తాం అంటూ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ పేరుతో నక్సల్స్ విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. చర్ల,
మావోయిస్టు లెటర్


భద్రాద్రి కొత్తగూడెం, 19 సెప్టెంబర్ (హి.స.)

భూస్వామ్య పెత్తందారుల్లారా ఖబర్దార్. ప్రజా కోర్టులో మిమ్మల్ని హతమారుస్తాం అంటూ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ పేరుతో నక్సల్స్ విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. చర్ల, దుమ్ముగూడెం మండలాలకు చెందిన కొందరు వ్యక్తుల పేర్లు ఆ లేఖలో పేర్కొని, ఇప్పటికైనా మారాలని, పద్ధతి మార్చుకోకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ బ్రోకర్లుగా మారి, పోలీస్ ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తూ, పేదల భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. కొంతమంది భూస్వాములు, రాజకీయ బ్రోకర్లు మరియు ఓ విలేఖరి పోలీస్

ఇన్ ఫార్మర్లుగా మారి ఆగడాలు చేస్తున్నట్లు మా విచారణలో తేలిందని వీరికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. విప్లవ పేరుతో విడుదలైన ఈ లేఖ భద్రాద్రి ఏజెన్సీ లో పెను సంచలనంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande