వర్షాలపై మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, తీసుకుంటున్న చర్యలపై జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ, విద్యుత్,హెల్త్ వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప
మంత్రి పొన్నం


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, తీసుకుంటున్న చర్యలపై జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ, విద్యుత్,హెల్త్ వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేటర్ వ్యాప్తంగా గత మూడు రోజులుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటం, ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు విధుల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుండి పిర్యాదులు అందితే వెంటనే స్పందించాలని అన్నారు.

అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నెంబర్ లు టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళేలా అక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు వెళ్లే మ్యాన్ హోల్ల వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ స్తంభాల, విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజ్ రూపంలో సందేశాలు పంపాలని అన్నారు. తీవ్రత అధికంగా ఉన్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు .

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande