హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 1, 2, 3, 4, 5, 23, 24, 25, 26 ప్యాకేజీల పనులను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రీ ఫీజబిలిటీ నివేదికను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన ధరల ప్రకారం ఈ 9 ప్యాకేజీల పనుల అంచనాలను సవరిస్తే, ప్రాజెక్టు వ్యయం ఐదారు రెట్లు పెరిగి రూ.35 వేల కోట్లకు చేరింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్కు నీటి తరలింపునకు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.84,000 కోట్లు ఖర్చకు అయిందని అన్నారు. కానీ, కేవలం తుమ్మడిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రూ.35 వేల కోట్లు ఖర్చ చేస్తోందని అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు