యూరియా కోసం ఒక రోజు ముందే క్యూ లైన్.. రైతు వేదిక వద్దే నిద్ర
మెదక్, 19 సెప్టెంబర్ (హి.స.) యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. సరైన సమయంలో యూరియా అందక సాగు చేస్తున్న పంట పొలాలు ఎరుపెక్కుతున్నాయి. సరిపడా యూరియా సరఫరా కాక రైతులు ఒకరోజు ముందుగానే క్యూ లైన్లో నిలుచున్న ఘటన మెదక్ జిల్లాలోని
యూరియా


మెదక్, 19 సెప్టెంబర్ (హి.స.)

యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. సరైన సమయంలో యూరియా అందక సాగు చేస్తున్న పంట పొలాలు ఎరుపెక్కుతున్నాయి. సరిపడా యూరియా సరఫరా కాక రైతులు ఒకరోజు ముందుగానే క్యూ లైన్లో నిలుచున్న ఘటన మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలం నస్కల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నస్కల్లోని రైతు వేదికకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో 500 యూరియా సంచులతో లారీ వచ్చింది. సమాచారాన్ని తెలుసుకున్న రైతులు రైతు వేదికకు చేరుకొని యూరియా దొరుకుతుందో లేదో అనే భయంతో రాత్రి అక్కడే బస చేశారు. మరి కొంతమంది రైతులు శుక్రవారం ఉదయం రైతు వేదికకు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande