ములుగు, 19 సెప్టెంబర్ (హి.స.)
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ములుగు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల వాహనాలకు సరియైన పత్రాలు ఉండి నిబంధనల మేరకు వాహనాలు నడుపుతున్న వారినీ వదిలివేసి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సరైన పత్రాలు లేని వారిపై కేసు నమోదు చేయాలని సూచించారు.
ద్విచక్ర వాహనాలు నడిపే వాహనాదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ఇతర మోటార్ వాహనాలు నడిపేవారు సీటు బెల్టు ధరించడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని అన్నారు. మద్యం సేవించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు