ఇటుక ట్రాక్టర్ బోల్తా.. ఒకరు స్పాట్ డెడ్, నలుగురికి తీవ్ర గాయాలు
మహబూబ్నగర్, 19 సెప్టెంబర్ (హి.స.) ఇటుక బట్టి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మిడ్జిల్ -వెల్జాల్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకార
ట్రాక్టర్ ప్రమాదం


మహబూబ్నగర్, 19 సెప్టెంబర్ (హి.స.)

ఇటుక బట్టి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్

అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మిడ్జిల్ -వెల్జాల్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఇటుక బట్టి నుండి ఒక ట్రాక్టర్ లోడుతో తలకొండపల్లి మండలం మాదాయపల్లికి వెళ్తుండగా బోల్తా పడింది. దీంతో జంగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి మండలం కొట్ర గ్రామానికి చెందిన జంగయ్య బతుకుదెరువు కోసం మిడ్జిల్లో తన బంధువుల దగ్గరకు వచ్చి ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande