తెలంగాణ, వికారాబాద్. 2 సెప్టెంబర్ (హి.స.)
కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీకి అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెల్త్ సెక్రటరీ, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు. ఈ ఏడాది నుంచే కొడంగల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నది. రెండ్రోజుల క్రితమే జీవో 33ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. స్థానికత విషయంలో సమస్య తీరడంతో ఒకట్రెండు రోజుల్లో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభంకానున్నది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో 4100కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు