యూరియా కోసం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన రైతులు..
తెలంగాణ, జడ్చర్ల. 2 సెప్టెంబర్ (హి.స.) యూరియా కోసం ఉదయాన్నే జడ్చర్లకు చేరుకున్న రైతులకు యూరియా సరఫరా లేకపోవడంతో యూరియా ఇవ్వలేమని షాపు యజమాని తెలపడంతో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లి యూరియా అందించాలని నినాదాల
జడ్చర్ల ఎమ్మెల్యే


తెలంగాణ, జడ్చర్ల. 2 సెప్టెంబర్ (హి.స.)

యూరియా కోసం ఉదయాన్నే జడ్చర్లకు చేరుకున్న రైతులకు యూరియా సరఫరా లేకపోవడంతో యూరియా ఇవ్వలేమని షాపు యజమాని తెలపడంతో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లి యూరియా అందించాలని నినాదాలు చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రైతులను క్యాంపు కార్యాలయంలోకి పిలిపంచుకొని వారితో మాట్లాడారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం ద్వారానే కొరత ఏర్పడిందని, ఈరోజు సాయంత్రంలోగా ప్రతి రైతుకు యూరియా అందిస్తానని తెలిపారు.

దీంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజుల నుంచి ఇదే మాట చెబుతున్నారని ఇవాళ కొత్తగా చెప్పింది ఏముందని యూరియా ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. దీంతో ఎమ్మెల్యేనే స్వయంగా రైతులతో కలిసి ఫర్టిలైజర్ షాప్ వద్దకు చేరుకొని వారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సాయంత్రం లోగా రైతులకు యూరియా సరఫరా చేయాలని ఆదేశించారు. అయినా కూడా రైతులు వినకపోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande