పాక్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ లో రేపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఒమన్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు గట్టిగా తా
ఆసియా కప్


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

ఆసియా కప్ లో రేపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఒమన్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు గట్టిగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఆ తర్వాత సన్స్టిట్యూట్గా స్టేడియంలోకి రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, సూపర్- 4 ముందు స్పిన్ ఆల్రౌండర్కు ఇలా జరిగితే జట్టు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కోవల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇక, అక్షర్కు ఏం కాలేదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. అతడికి స్కానింగ్ చేసే అవకాశం ఉందన్నారు. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ రేపటి మ్యాచ్ లో ఆడొచ్చు.. లేకపోతే మరొకరిని తుది జట్టులోకి తీసుకుంటామన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande