శ్రీశైలం వెళ్తున్న బస్సు బోల్తా.. బస్సులో 50 మంది ప్రయాణికులు..
గుంటూరు, 20 సెప్టెంబర్ (హి.స.): ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద భారీ ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సు శ్రీశైలానికి వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ప
శ్రీశైలం వెళ్తున్న బస్సు బోల్తా.. బస్సులో 50 మంది ప్రయాణికులు..


గుంటూరు, 20 సెప్టెంబర్ (హి.స.): ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద భారీ ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సు శ్రీశైలానికి వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించినట్లు పేర్కొన్నారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande