ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు..
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది.. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం
ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు..


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది.. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టం అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక.. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు.. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు.. ప్రతిపక్ష హోదా చాక్లెటో, బిస్కెటో కాదు అని మంత్రి అనిత పేర్కొనింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande