కేటీఆర్, హరీష్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు..
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలోని ఆడపడుచులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని కేటీఆర్ కొనియాడారు. తీ
బతుకమ్మ


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణలోని ఆడపడుచులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని కేటీఆర్ కొనియాడారు. తీరొక్క పూలను అందంగా పేర్చి, ఆటపాటలతో పూలనే పూజించే అపురూప వేడుక మన బతుకమ్మ పండగ అని పేర్కొన్నారు. నేటి నుండి మొదలయ్యే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ... తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.

తెలంగాణ అస్తిత్వానికి,సాంస్కృతిక జీవనానికి తరతరాల ప్రతీక మన బతుకమ్మ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పూలను, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ మన బతుకమ్మ అని ఆయన కొనియాడారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు హరీశ్రావు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande