జీఎస్టీ సంస్కరణలతో నష్టముంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లొచ్చు! బండి సంజయ్
కరీంనగర్, 21 సెప్టెంబర్ (హి.స.) జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిజంగా జీఎస్టీ సంస్కరణలవల్ల ఏదైనా సమస్య ఉంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా స
బండి సంజయ్


కరీంనగర్, 21 సెప్టెంబర్ (హి.స.)

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిజంగా జీఎస్టీ సంస్కరణలవల్ల ఏదైనా సమస్య ఉంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ రోజు కరీంనగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు..

జీఎస్టీపై పెద్ద ఎత్తున సంస్కరణలు తెచ్చాం. రేపటి నుండి జీఎస్టీ కొనుగోలు దారులను, అమ్మకం దారులను సన్మానిస్తాం. దురదృష్టమేంటంటే సౌత్, నార్త్ అంటూ పనిలేనోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌత్ వ్యక్తి. ఏమైనా ఇబ్బందులుంటే ఆమెతో మాట్లాడి సమస్య ఉంటే పరిష్కరించుకోవచ్చు. లేకుంటే నష్టం జరిగితే మీడియా ద్వారా ప్రజలకు చెప్పవచ్చు. అట్లాకాకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? అలాంటివారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande