అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదని.. లక్షలాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఆశా కిరణమని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆర్డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని.. వాటిని శాశ్వతంగా పరిష్కరించి సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సంప్రదించామని... ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలతో ఆత్మీయ, మానవతా సేవా బంధం పెనవేసుకున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ