హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
విజయ దశమి సెలవులు ప్రారంభం
కావడంతో పట్నంలో నివసిస్తున్న వారంతా తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు విజయవాడ వైపు వెళ్లే వాహనాలు లైన్ల సంఖ్యను పెంచి రద్దీ తగ్గించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది విజయదశమి, సంక్రాంతి పండగల సమయంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ సర్వసాధారణమై పోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..