హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ నళిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వరాష్ట్రం కసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా నళిని ఆరోగ్యానికి సంబంధించిన విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. చావు బతుకుల మధ్య నళిని కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ ( వీలునామా/ మరణ వాంగ్మూలం)రాసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు