వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. వానాకాలానికి ముందే నాలాలన్నీ శుభ్రం చేయాలని తెలిపారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీ
హరీష్ రావు


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. వానాకాలానికి ముందే నాలాలన్నీ శుభ్రం చేయాలని తెలిపారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నిటినీ క్లీన్ చేయించేవారని చెప్పారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు శుభ్రం చేయకపోవడం వల్ల నాలాల నుంచి వరద వచ్చింది. హైదరాబాద్ సనత్నగర్లోని రాంగోపాల్పేట డివిజన్లో వరదలో మునిగిపోయిన పలు కాలనీలను పరిశీలించి, బాధితులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీశ్ రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద వల్ల ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande